
- ఈనెల 20 నుంచి 24 వరకు నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని గిరిజన మహిళలకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ వంటి ఆధునిక కళలతోపాటు సంప్రదాయ గిరిజన కళలపై ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (టీసీఆర్ ఐ) డైరెక్టర్ సముజ్వల శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 20 నుంచి 24 వరకు మసాబ్ ట్యాంక్ డీఎస్ఎస్ భవన్ లోని టీసీఆర్ ఐ క్యాంపస్ లో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో పాల్గొనే మహిళలు రూ.2,500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తెలంగాణ ట్రైబల్ డిపార్ట్ మెంట్ తరఫున సర్టిఫికెట్స్ అందజేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం టీసీఆర్ఐ ఆఫీస్‌ను సందర్శించాలని సూచించారు.