
- చెత్త డబ్బాలో పేలుడు పదార్థాలు ఉన్నాయని ఫోన్ కాల్
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ మెట్రో స్టేషన్లో బాంబు ఉందంటూ శుక్రవారం వచ్చిన ఫోన్ కాల్ తీవ్ర కలకలం రేపింది. స్టేషన్‌లోని చెత్త డబ్బాలో పేలుడు పదార్థాలు ఉన్నాయని ఓ ఆకతాయి కాల్ చేసి చెప్పడంతో మెట్రో సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ప్రయాణికులందరినీ స్టేషన్ నుంచి బయటకు పంపించి, బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో స్టేషన్ అంతటా తనిఖీలు చేపట్టారు.
అనంతరం ఓ చెత్త డబ్బాలో ‘సుతిల్ బాంబు’ లు గుర్తించారు. అవి కేవలం సెలబ్రేషన్స్‌లో వాడేవని, ప్రమాదకరమైనవి కాదని తేలడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం భయాందోళనకు గురిచేయడానికే ఎవరో ఆకతాయి ఈ పని చేశాడని ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడి కోసం సెర్చ్చేస్తున్నారు.