Reading Time: < 1 minute

తప్పతాగి బస్సు డ్రైవర్ బీభత్సం

Caption of Image.
  • ఓవర్​స్పీడ్​తో రెండు బైక్​లను ఢీకొట్టిన వైనం
  • ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

కూకట్ పల్లి, వెలుగు: ఓ ప్రైవేట్ కంపెనీ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడిపి ఒకరి ప్రాణాన్ని బలి తీసుకోగా, మరో ఇద్దరిని ప్రాణాపాయ స్థితికి చేర్చాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో హెటెరో కంపెనీకి చెందిన బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు మద్యం మత్తులో అతివేగంగా వచ్చి ఐడీపీఎల్ సమీపంలో రెండు బైక్​లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నారాయణగూడకు చెందిన వాడ్రేవు మురళీకృష్ణ (46) అక్కడికక్కడే మృతి చెందగా, మరో బైక్​పై ఉన్న లక్ష్మణ్, బబ్లు అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డివైడర్​ను ఢీకొని మరొకరు

ఫ్రెండ్ బర్త్​డే పార్టీలో పాల్గొని, అర్ధరాత్రి నగరాన్ని చూసేందుకు ఒకే బైక్​పై వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన భరత్ (18), సుభాశ్ (19), వినీత్ (21) గురువారం అర్ధరాత్రి దాటాక బైక్​పై సిటీకి వచ్చి తిరిగి వెళ్తుండగా, శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో బాలానగర్​లో అదుపుతప్పి డివైడర్‌‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భరత్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మిగిలిన ఇద్దరికి వేర్వేరు హాస్పిటళ్లలో చికిత్స కొనసాగుతోంది. 

©️ VIL Media Pvt Ltd.