Reading Time: 2 minutes

 కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గిల్ ‘రాంపేజ్’.. కేకేఆర్‌పై గుజరాత్ ఘన విజయం

Caption of Image.

GT vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో గుజరాత్ టైటాన్స్ మరోసారి “మాస్” పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై గుజరాత్ (GT) అద్భుత విజయాన్ని అందుకుంది. కేకేఆర్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

గిల్ ‘కెప్టెన్’ ఇన్నింగ్స్: 
181 పరుగుల ఛేజింగ్‌లో గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 57 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. ఇక కెప్టెన్ గిల్ గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ కేకేఆర్ బౌలర్లను “చెడుగుడు” ఆడుకున్నాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గిల్, మొత్తం 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86 పరుగులు చేసి మ్యాచ్‌ను గుజరాత్ వైపు తిప్పేసిన తర్వాత 16.5 ఓవర్లో వైభవ్ ఆరోరా బౌలింగ్ లో కామెరాన్ గ్రీన్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మరో బ్యాటర్ జోస్ బట్లర్ వచ్చి రాగానే “ఫైర్” మోడ్ ఆన్ చేశాడు. 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 25 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో కామెరాన్ గ్రీన్ కి క్యాచ్ అందించి వెళ్లిపోయాడు. 

ఫినిషింగ్ అదిరింది!
సాయి సుదర్శన్ (22), వాషింగ్టన్ సుందర్ (13) త్వరగానే అవుట్ అయినప్పటికీ, చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (19 )తో చేసి రమణ్ దీప్ బౌలింగ్ లో ఔట్ కాగా, రాహుల్ తెవాటియా (7), షారుక్ ఖాన్(3) ఆచితూచి ఆడి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. కేకేఆర్ బౌలర్లలో కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి కీలకమైన రెండు వికెట్లు పడగొట్టగా, సునీల్ నరైన్, వైభవ్ ఆరోరా చెరో వికెట్ తీసుకున్నప్పటికీ, గిల్ ధాటికి రన్ రేట్‌ను కట్టడి చేయలేకపోయారు. ఈ ఓటమితో కేకేఆర్ వరుసగా తన ఖాతాలో 6వ ఓటమిని వేసుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కేకేఆర్‌కు ఈ సీజన్ ఒక “నైట్‌మేర్” లా మారుతోంది. మరోవైపు ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. 

©️ VIL Media Pvt Ltd.