Reading Time: < 1 minute

ఇపుడు ప్రజలు గుర్తొచ్చారా.? కేటీఆర్ పాదయాత్రపై కవిత కౌంటర్

Caption of Image.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర ప్రకటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కౌంటర్ వేశారు.  పదేండ్లు అధికారంలో ఉండి ప్రజల్లో ఉండలేదు కానీ..ఇపుడు ప్రజలను చూసేందుకు పాదయాత్ర చేస్తారా అని సెటైర్ వేశారు.  

శనిపోవాలనే  తాను వారణాసి వెళ్లి పూజలు చేశానని చెప్పారు కవిత.  తాను పెట్టే పార్టీ సక్సెస్ కావాలని కోరానన్నారు.  బీఆర్ఎస్ లోని కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు తనతో  టచ్ లో ఉన్నారని చెప్పారు. ఆ మాజీ ఎమ్మెల్యేలు ఎవరనేది పేర్లు చెప్పబోనన్నారు. తొలుత బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశా..ఇపుడు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నా.. ప్రజా సమస్యలను తీర్చేది అధికార పార్టీనే అన్నారు.  ఇష్యూను బట్టి బీఆర్ఎస్ ను కూడా టార్గెట్ చేస్తానన్నారు కవిత. 

త్వరలో ప్రజాసమస్యలపై  పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ఏప్రిల్ 12న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కవిత కేటీఆర్ పై విమర్శలు చేశారు. 
 

©️ VIL Media Pvt Ltd.