Reading Time: 2 minutes

పంజాబ్ చేతిలో ముంబై ఘోర ఓటమి.. గుక్కపెట్టి ఏడ్చినంత పని చేసిన హార్దిక్ పాండ్యా

Caption of Image.

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు వైఫల్యం కొనసాగుతుంది. ఆడిన 5 మ్యాచ్ ల్లో ఒక్క విజయం సాధించింది. ఇక గురువారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లోనూ ముంబై దారుణంగా ఓడిపోయింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ లు చెలరేగి బ్యాటింగ్ చేయగా, వారిని కట్టడి చేయడంలో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఈ మ్యాచ్ ఓటమితో ముంబై ఇండియన్స్ పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది.
 
ఓటమి తర్వాత ఢీలా పడిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బస్సులో హోటల్ రూంకి బయల్దేరిన సమయంలో మీడియా కంట పడ్డాడు. మీడియాను చూసి అతడు ముఖం చాటేస్తూ, తన చేతులు అడ్డుపెట్టుకొని గుక్క పెట్టి ఏడ్చినంత పని చేశాడు. తన పక్కనే కూర్చున్న సూర్యకుమార్ యాదవ్ కూడా డల్ గా ఉన్నాడు. పక్కనే కూర్చున్న సూర్యతో కూడా పాండ్యా ఏం మాట్లాడకుండా బస్ అద్దం వైపు తిరిగి కూర్చొని బయటకి చూస్తూ కంటతడి పెట్టినట్లు కెమెరాలలో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక కెప్టెన్ గానే గాక ప్లేయర్ గానూ హార్దిక్ పాండ్యా ఫెయిల్ అయ్యాడు. 4 మ్యాచ్లు కలిపి 27 సగటుతో కేవలం 81 రన్స్ మాత్రమే చేశాడు. బౌలింగ్ 2 వికెట్లు మాత్రమే తీసిన పాండ్యా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 

►ALSO READ | అహ్మదాబాద్‌లో నేడు KKR vs GT పోరు.. ఏ జట్టు గెలుస్తుందో తెలుసా!

పంజాబ్ కింగ్స్ తో మ్యాచులోనూ టాస్ ఓడిపోవడం దగ్గరి నుంచి హార్దిక్ కి ఏదీ పెద్దగా కలిసిరాలేదు. బ్యాటింగ్ లో 14 రన్స్ మాత్రమే చేసిన ఈ ఆల్ రౌండర్ 3 ఓవర్లు వేసి 39 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు.. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసింది. క్వింటన్ డికాక్ సెంచరీతో రాణించాడు. అనంతరం పంజాబ్ ప్రభ్ సిమ్రాన్, శ్రేయస్ విధ్వంసంతో 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 198 పరుగులు చేసి గెలిచింది.  

©️ VIL Media Pvt Ltd.