Reading Time: < 1 minute

హమ్మయ్యా తగ్గిన బంగారం, వెండి.. శుక్రవారం హైదరాబాద్ రేట్లు ఇవే..

Caption of Image.

ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం తిరిగి ఇచ్చేసి అణు ఆయుధాల తయారీకి దూరంగా ఉంటామని చెప్పిందంటూ ట్రంప్ చెబుతోంటే ఇరాన్ నుంచి అలాంటిదేమీ లేదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణ బ్రేక్ ముగిసిన తర్వాత చర్చలు ముందుకెళతాయా లేక యుద్ధం తిరిగి స్టార్ట్ అవుతుందా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. ఈ గందరగోళం మధ్య బులియన్ మార్కెట్లు జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో రిటైల్ ఆభరణాల కొనుగోలుదారులు తగ్గిన రేట్ల గురించి తెలుసుకుని ముందుకెళ్లటం మంచిది. 

ఏప్రిల్17న బంగారం రేట్లు తగ్గాయి. ఏప్రిల్ 16 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.137 తగ్గుదలను నమోదు చేసింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 420గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 135గా కొనసాగుతోంది. 

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్17, 2026న దేశవ్యాప్తంగా రేటు కేజీకి రూ.5వేలు తగ్గింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి ఎలాంటి మార్పులు లేకుండా రూ.2లక్షల 75వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.275గా అమ్మకాలు జరుగుతున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.