
నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని పసుపు రైతుల ప్రయోజనాలు కాపాడుతామని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఓపెన్ ఆక్షన్ విధానంలో పసుపు అమ్మకాలు చేపట్టి లాభసాటి రేట్పొందడానికి సహకరిస్తామన్నారు. గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రొగ్రాంలో భాగంగా సిరికొండ మండలం ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన మీటింగ్లో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్తో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బహిరంగ వేలంపాటలో క్వింటాల్పసుపునకు రూ.16 వేల ధర లభిస్తోందని, రైతులు అపోహలకు గురికావొద్దన్నారు. అగ్రికల్చర్ సైంటిస్టుల సూచనలు పాటిస్తూ సాగులో రాణించాలన్నారు. త్వరలో సెకండ్ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నట్లు తెలిపారు. మండల స్పెషల్ఆఫీసర్ నాగూరావు, తహసీల్దార్రవీందర్రావు, ఎంపీడీవో మనోహర్తదితరులు ఉన్నారు.
ప్రజా క్షేత్రంలోనే సమస్యలు పరిష్కారం
సిరికొండ, వెలుగు: ప్రజా క్షేత్రంలో సమస్యలు పరిష్కరించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రహించి ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తాహెర్బిన్ హందాన్అన్నారు. సిరికొండలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో కలెక్టర్ఇలా త్రిపాఠితో కలిసి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ చేరాలన్నారు. గ్రామాల నుంచి వచ్చిన అర్జీలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాని అధికారులను కలెక్టర్ఆదేశించారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎర్రన్న, గంగారెడ్డి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.