Reading Time: < 1 minute

సెంట్రల్ హాల్కు డిజైన్లు రూపొందించండి..  అధికారులకు మండలి చైర్మన్ గుత్తా ఆదేశం

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల మధ్యలో సెంట్రల్ హాల్ నిర్మాణానికి డిజైన్లు రూపొందించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన కౌన్సిల్ లోని తన చాంబర్ లో  ఆర్అండ్ బీ, లెజిస్లేచర్​అధికారులు, అఘాఖాన్ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

పార్లమెంట్ సెంట్రల్ హాల్ స్థాయిలో అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల మధ్య సెంట్రల్ హాల్ నిర్మాణానికి అవసరమైన పనులను వెంటనే ప్రారంభించాల్సి ఉందన్నారు. హాల్​ను ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.