
బషీర్బాగ్, వెలుగు: ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా జూన్ 2 కంటే ముందే తరగతులు నిర్వహిస్తున్న బషీర్బాగ్లోని అలెన్ ఇనిస్టిట్యూట్ ముందు ఏఐవైఎఫ్ నాయకులు గురువారం ధర్నా చేపట్టారు. కోచింగ్ పేరుతో అక్రమంగా క్లాసులు నిర్వహించడం చట్టవిరుద్ధమని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మండిపడ్డారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఇటువంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, అలెన్ సంస్థను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.