Reading Time: < 1 minute

బిల్లులు రాలేదని స్కూల్ రూములకు తాళం

Caption of Image.

ఇల్లంతకుంట, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల ప్రభుత్వ పాఠశాలలో నిర్మించిన రెండు తరగతి గదులు, డైనింగ్ హాల్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రూ.22 లక్షల బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తూ మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ వెంకటనర్సింహారెడ్డి గురువారం ఆ గదులకు తాళం వేశారు. ఈ ఘటనతో విద్యార్థులు, టీచర్లు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై హెచ్​ఎం శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌పై ఫిర్యాదు చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.