Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి రెం డు నూతన విమానాశ్రయాలు రాబోతున్నా యి. ఆదిలాబాద్‌లో అతి పెద్ద విమానాశ్రయా న్ని నెలకొల్పనున్నట్లు, మామునూరుకు మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్రానికి చెందిన కేంద్ర బొగ్గు గను ల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సమక్షంలో ఈ శుభ వార్త వెల్లడించారు. అ న్ని డిమాండ్లను పరిశీలిస్తున్నామని పౌరవిమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ తెలిపారు. విమానాశ్రయాల అవసరం ఉన్న చో ట నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నె లల్లో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చే స్తున్నామన్నారు.

ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలనూ పరిశీలిస్తున్నామని, అయితే ఆదిలాబాద్‌లో పెద్ద విమానాశ్ర యం నిర్మించాలని కేంద్రం భావిస్తోందన్నారు. సైని క, పౌరుల అవసరాలకు అనుగుణంగా ఇది ఉంటుంది అని తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైనట్లు ఆయన చెప్పారు. ఎప్పటి నుంచో తెలంగాణలో ఒకే విమానాశ్రయం కేవలం హైదరాబాద్‌లోనే ఉందన్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ విమానాశ్రయాలు ఉండాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షిస్తున్నారని ఆయన చెప్పారు. ఫీజిబిలిటీకి తగ్గట్లుగా విమానాశ్రయాలు నిర్మించాలనేది ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన అని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా వరంగల్ లో విమానాశ్రయానికి అడుగులు ముందుకు వేస్తున్నామని, మరో మూడు నెలల్లో మామునూరులో శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణకు ముఖద్వారమైన ఆదిలాబాద్‌లో, పర్యాటకానికి, వివిధ వాణిజ్య కార్యక్రమాలను ప్రోత్సహించేలా విమానాశ్రయం రావాలని చిరకాల డిమాండు ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పలు దఫాల్లో చర్చించామని,వివిధ ఫీజిబుల్ ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణంపై దృష్ఠి సారించమని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌లో 360 ఎకరాలకు సంబంధించిన డిఫెన్స్ స్థలంలో విమానాశ్రయం నిర్మించాలను కున్నామని ఆయన తెలిపారు. లోగడ కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమై కోరామని ఆయన చెప్పారు. దీనికి రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపిందని ఆయన వివరించారు.

మరో 450 ఎకరాలు అవసరం

ఆదిలాబాద్ లో విమానాశ్రయానికి అదనంగా మరో 450 ఎకరాల అవసరం అని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణ డిమాండ్ గురించి చెప్పడంతో సానుకూలంగా స్పందించిందని ఆయన చెప్పారు.విమానాశ్రయానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నామని, మొదట ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించాలని అనుకున్నామని, అయితే రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యూహాత్మకమైన ప్రాంతం కావడం, వైమానిక దళం శిక్షణకు కీలకమైన ప్రాంతం కావడంతో ఈ విమానాశ్రయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంట్లో ఒక పక్కన సామాన్య ప్రజల కోసం విమాన సేవల టర్మినల్‌ను ఎయిర్ పోర్ట్ అథారిటీ నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు తెలిపారు.సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ నెల 17న క్షేత్రస్థాయిలో సర్వే చేసిన తర్వాత రన్ వే ఓరియంటేషన్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకు అవసరమైన 450 ఎకరాల స్థలాన్ని అప్పజెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని ఆయన తెలిపారు. భూసేకరణలో ఎలాంటి సమస్యలు లేవని ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పారని ఆయన వివరించారు. ఆదిలాబాద్ భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉన్న ప్రాంతం అవుతుందన్నారు. కమర్షియల్ హబ్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జేవర్ విమానాశ్రయం యూపీ ప్రభుత్వం పిపిపి పద్ధతిలో చేసుకుందని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే రాష్ట్రం భూమిని తమకు అప్పగించాల్సి ఉంటుందన్నారు. పెద్దపల్లిలో ఒక స్థలాన్ని ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిందని, తమ నివేదికలోనూ సానుకూలంగా వచ్చిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక సమాధానం వచ్చిన తర్వాత ముందుకెళ్తామన్నారు. విమానాశ్రయానికి 600 నుంచి 700 ఎకరాలు అవసరం ఉంటుందని ఆయన తెలిపారు. పెద్ద విమానాశ్రయాలు భవిష్యత్ కోసం కావాలంటే కనీసం 1200 ఎకరాలు అవసరం అవుతాయన్నారు. కొత్తగూడెంకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఫీజిబుల్ కాదన్న విషయాన్ని తెలియజేశామని కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు తెలిపారు.

-=-=-=-=-=-=-=-=-=-=-

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం

రాష్ట్రంలో వరంగల్ విమానాశ్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఎయిర్ స్ట్రిప్ ఉన్నదని, ఆ స్థలంలో నూతన విమానాశ్రయం కట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి చర్చించామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, పౌర విమానయాన శాఖ అధికారులు, రక్షణ శాఖ అధికారులు, ఆదిలాబాద్ కలెక్టర్ పాల్గొన్నారు.

–++–