
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్ రా వు ధ్వజమెత్తారు. బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే ఈ కుట్ర జరుగుతుందని, ఆ నె పాన్ని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నా రా అంటూ ప్రశ్నించారు. భారీ నీటి పారుదల మోటార్లను ఇష్టానుసారం స్టార్ట్, స్టాప్ చేయడం ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధమని, ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్,
మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చే శారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా మోటార్లను పాడు చేస్తున్నారా?, లేక ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా? అని నిలదీశారు. భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవని, పదే పదే ఆపితే తీవ్ర న ష్టం కలుగుతుందని హెచ్చరించారు. చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరమని, తక్షణమే మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం, డిజైన్ కు అనుగుణంగా ని రంతరాయంగా పంపులు నడిపించాలని, రాజకీయాల కోసం రా ష్ట్ర రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని హ రీష్ రావు హెచ్చరించారు.