Reading Time: < 1 minute

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు, గుజరాత్ టైటాన్స్ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్(70), జోస్ బట్లర్(52), వాషింగ్టన్ సుందర్(55) అర్ధ శతకాలతో చెలరేగారు. ఇక, ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్ లు చెరో వికెట్ తీశారు.