Reading Time: < 1 minute

నాదర్‌గుల్ గ్రామంలోని సర్వే నంబర్ 613లో గల 370 ఎకరాల భూమిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సాక్ష్యాధారాలతో మంత్రి పొంగులేటి తిప్పికొట్టారు. ఈ భూమి బాగోతం మొత్తం గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. 2014లోనే మూడు సంస్థలకు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా, 2016లో మ్యుటేషన్ పూర్తి చేసింది కూడా గత ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. గూగుల్ మ్యాప్స్ సాక్ష్యాలను బయటపెడుతూ 2021 వరకు ఖాళీగా ఉన్న ఈ భూమిలో 2022 నాటికి రోడ్లు నిర్మించి,

రేకుల షెడ్లు వేయించింది బిఆర్‌ఎస్ నాయకులేనని ఆయన మండిపడ్డారు. ఈ భూమి విషయంలో గత ప్రభుత్వం కోర్టులో కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం వహించిందని గత ప్రభుత్వమని, కానీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మార్చి 15న ప్రభుత్వం తరపు కౌంటర్ దాఖలు చేశామని ఆయన వెల్లడించారు. తమ పార్టీ మంత్రులపై బురద జల్లడం ద్వారా తమ కుటుంబ ఆస్తుల పెంపు, పంపకాల చర్చను పక్కదారి పట్టించాలని ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు.