
ఇరాన్ తో కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఈ హెచ్చరికలు ఇరాన్ కు కాదు.. ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు. ఇక నుంచి ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేస్తూ.. అమెరికాకు ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని తన ట్రూత్ సోషల్ లో ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా, ఇరాన్ ఎట్టకేలకు అమెరికాతో కాల్పుల విరమణకు ఒప్పుకోవడంతో పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర పడింది. కాల్పుల విరమణ డీల్ తర్వాత రెండు వారాల పాటు ఇరాన్‌పై దాడులకు ట్రంప్ విరామం ప్రకటించారు. హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరిచేందుకు ఇరాన్ అంగీకారించడంతోపాటు 10 ప్రతిపాదనలను ఇరాన్.. అమెరికా ముందు ఉంచింది. దీనికి ట్రంప్ ట్రంప్ అంగీకరించడంతో రెండు వారాలపాటు హార్ముజ్ లో రాకపోకలకు అనుమతి ఇస్తామని భద్రతామండలికి ఇరాన్ తెలిపింది.