Reading Time: < 1 minute

తిరువనంతపురం: కేరళలో యూడిఎఫ్, ఎల్ డిఎఫ్ మధ్య పోటి ఉందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ, కేరళ మధ్య ఎన్నికలు జరగట్లేదని అన్నారు. సిఎం కేరళలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేరళ సిఎం పినరయి విజయన్.. కేరళ ప్రజలను మోసం చేస్తున్నారని, పినరయి విజయన్ తో తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. పినరయి విజయన్ కు ఆదర్శమంతమైన నేతలు ఎవరు? అని రేవంత్ ప్రశ్నించారు. పినయరయి విజయన్.. ప్రధాని నరేంద్ర మోడీ సూచనలు తీసుకుంటున్నారని, కేరళలో విజయన్.. మోడీలా పాలిస్తున్నారని విమర్శించారు. ఓట్ల కోసం మోడీలానే విజయన్ తన పేరుతోనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేరళలో ప్రజల నుంచి తనకు ఫీడ్ బ్యాక్ వచ్చిందని, మాజీ సిఎం కెసిఆర్.. విజయన్ కు మంచి మిత్రుడని అన్నారు. కెసిఆర్ పాలన గురించి విజయన్ ప్రస్తావించారని, తెలంగాణలో కెసిఆర్ ను ఎలా మార్చారో.. కేరళలో కూడా విజయన్ ను మార్చేస్తారని పేర్కొన్నారు. విజయన్ గాడ్ ఫాదర్ మోడీ డిల్లీలో ఉన్నారని, మోడీ..విజయన్ ను కేసుల నుంచి రక్షిస్తున్నారని అన్నారు. మోడీ, విజయన్ మధ్య ఒప్పందం ఉందని, కేరళలో సక్సెస్ స్టోరీ విజయన్ పాలనలో వచ్చింది కాదని అన్నారు. ఉమెన్ చాందీ, కరుణాకరన్ కేరళ అభివృద్ధి కోసం బాటలు వేశారని, పినరయ్ విజయన్ కు కాలం అయిపోయిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.