
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆర్‌సిబి జట్టు సీజన్ ఆరంభ మ్యాచ్ ఆడటం ఇది ఏడోసారి. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది రెండోసారి.
తుది జట్లు:
ఆర్‌సిబి: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేశ్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకడ్ డఫీ, సుయాశ్ శర్మ.
ఎస్‌ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబె, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, ఇషాన్ మలింగా.