
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రోను విస్తరించాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఫేజ్-2ఎ 76.4 కి.మీ., ఫేజ్-2బి 86.1 కి.మీ విస్తరణకు తీర్మానం జరిగింది. మెట్రో విస్తరణలో ఉన్న అవరోధాలను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. సాంకేతిక, చట్టపరమైన, నిర్వహణ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం చేసుకునే నిర్ణయానికి సభ ఆమోదం తెలిపింది. మెట్రో ఫేజ్-2కు కేంద్ర ఆమోదం త్వరగా లభించేలా కృషి చేయాలని తీర్మానం చేశారు.