
ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో గ్రాండ్ సక్సెస్‌ని అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన తదుపరి చిత్రం వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీ రామ నవమి సందర్భంగా సినిమా నుంచి ఓ అప్‌డేట్‌ని విడుదల చేశారు.
అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి సినిమాలు తీసిన సాహు గారపాటి ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. అలానే సురేశ్ బాబు, జీ స్టూడియోస్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోనున్నారు. శ్రీ రామ నవమి సందర్భంగా పోస్టర్‌ని రిలీజ్ చేసి.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో వెంకీ, కళ్యాణ్ రామ్‌కు జోడీగా.. కీర్తి సురేశ్, కృతి శెట్టిలు నటిస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.