Reading Time: < 1 minute

ప్రధాని నరేంద్ర మోడీ శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడం ఒక సాహసోపేతమైన నిర్ణయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అభివర్ణించారు. దేశ ప్రజలకు తీపి కబురు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, సామాన్య, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, జనరంజకమైన నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా ’సున్నా’ స్థాయికి తగ్గించడం పెట్రోల్‌పై కూడా రూ. 10 భారాన్ని తగ్గించి కేంద్రం తన బాధ్యతను చాటుకుందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన బాధ్యతను ఎప్పుడు నెరవేరుస్తుందని రాంచందర్ రావు ప్రశ్నించారు.