
యూట్యూబ్‌లో కామెడీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్. ఆ తర్వాత వెండితెరపై సైడ్ క్యారెక్టర్లు చేస్తూ.. నిలకడగా హీరోగా ఎదిగాడు. అయితే సుహాస్ నటించిన చిత్రం ‘హే బల్వంత్’. శివానీ నాగరం ఇందులో హీరోయిన్. ముందుగా ఈ సినిమాకు ‘హే భగవాన్’ అని టైటిల్ పెట్టారు. కానీ, సినిమా చూసిన సెన్సార్ అధికారులు టైటిల్ మార్చాలని సూచించారు. దీంతో ‘హే బల్వంత్’ అనే టైటిల్‌తో సినిమాను విడుదల చేశారు.
కాస్త అడల్ట్ టచ్‌తో ఉన్న కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమా కొందరికి నచ్చగా.. మరి కొందరికి ఎబ్బెట్టుగా అనిపించింది. మొత్తానికి యావరేజ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 20న థియేటర్‌లలోకి వచ్చిన ఈ సినిమా ఈ నెల 31 నుంచి జి5లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.