Reading Time: < 1 minute

క్రికెట్ ఆటగాళ్లకు సహజంగా ఫిట్‌నస్ చాలా ముఖ్యం. ఫిట్‌నెస్ లేక చాలా మంది అవకాశాలు కోల్పోతారు. ఇక ఫిట్‌గా ఉండేందుకు రకరకాల డైటింగ్ విధానాలు పాటిస్తున్నవారు లేకపోలేదు. ఇలా డైటింగ్ చేస్తూ.. జిమ్‌లో కసరత్తు చేసి బాడీని ఫిట్‌గా ఉంచుకొనే ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. ఒకప్పుడు బొద్దుగా ఉండే రోహిత్ ఇప్పుడు స్లిమ్‌గా గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. రోహిత్ కొత్త లుక్‌లో కనిపిస్తున్న వీడియోని ముంబై ఇండియన్స్ జట్టు ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోలో కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ జట్టు ఓనర్ నీతా అంబానీ కనిపించారు. మరి పూర్తిగా స్లిమ్‌గా మారిన రోహిత్ ఈ సీజన్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి..