
స్టార్ హీరో రామ్‌చరణ్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సహ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, మెగాస్టార్.. రామ్ చరణ తండ్రి చిరంజీవి తన కుమారుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చరణ్ చిన్ననాటి ఫోటోలను ఎక్స్‌లో పోస్ట్ చేసిన చిరు.. ‘‘చిన్నప్పుడు నా వేలు పట్టుకొని నడిచిన రోజు నుంచి.. ఈ రోజు ఎంతో మందికి ఆదర్శంగా మారిన స్థాయికి ఎదిగిన నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సినిమా, వ్యక్తిగత జీవితాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసే విధానం, కుటుంబంపై నీకున్న బాధ్యత, దేవుడిపై భక్తి, క్రమశిక్షణ, నీ విలువలు.. వీటిని చూస్తుంటే నీపై ప్రేమ, గౌరవం మరింత పెరుగూనే ఉన్నాయి. ఆ దేవుడి ఆశీస్సులు, అభిమానుల ప్రేమాభిమానాలతో నువ్వు ఉన్న శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.