Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: గల్ఫ్ యుద్ధం, తలెత్తుతున్న చ మురు సంక్షోభం ఇతర కీలక విషయాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మో డీ శుక్రవారం మాట్లాడనున్నారు. వర్చువల్ పద్ధతిలో ఇంటర్నెట్ ద్వారా పరిస్థితి ని సమీక్షిస్తారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు గురువారం తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలను మినహాయించి ఇతర రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మాట్లాడుతారు. ప్ర స్తుత దశలో రాష్ట్రాల సన్నద్ధత, తీసుకోవల్సిన చర్యలు సమీక్షిస్తారు. రాష్ట్రాల వారిగా ఆలోచనలను తెలుసుకుంటా రు. గల్ఫ్ యుద్ధం తీవ్రరూపం తరువా త ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష కు దిగడం ఇదే తొలిసారి. వీడియో కా న్ఫరెన్స్ సాయంత్రం 6.30 గంటలకు జరుగుతుంది. సమస్య తలెత్తుతున్న దశలో దేశం అంతా జట్టుగా వ్యవహరించే

క్రమంలో పూర్తి స్థాయి సమన్వయం పై దృష్టి సారించేందుకు ఈ సమావేశం ఏర్పాటు అవుతోంది. ఇంధన భద్రత, సరఫరాల వ్యవస్థలు, విదేశాల్లోని భారతీయుల రక్షణ, తరలింపు వంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి. అంతర్జాతీయ అస్థిరతల దశలో అంతర్గత సుస్థిరతల నిర్వహణ కీలక అంశం కానుంది. కోడ్ కారణంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల సిఎంలు ఈ సమీక్షలో పాల్గొనడం లేదు. మరో వైపు ఎన్నికలు జరిగే రాష్ట్రాలు తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రెటరీలు వేరుగా సమీక్ష జరుపుతారు. సిఎంలతో ప్రధాని అంతర్గత సమీక్ష, ప్రభుత్వాధికారుల సమావేశం క్రమంలో దేశంలో ఏదైనా విధాన నిర్ణయం అమలులోకి తీసుకువస్తారా? ఇంధన సరఫరాకు కేంద్రం నుంచి ఏదైనా విధివిధానాలు ప్రకటన ఉంటుందా? అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది.