
శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు, జగన్మాత సీతాదేవిని వివాహమాడే పర్వదినముగా శ్రీరామ నవమిని జరుపుకుంటారని తెలిపారు. భారతీయ సాంస్కృతిక సామాజిక కుటుంబ జీవన గమనంలో, సంప్రదాయాలు విలువలకు, ధర్మానికి ప్రాధాన్యతనిస్తూ సాగిన శ్రీ సీతారాముల భార్యాభర్తల బంధానికి, హిందూ మత సాంప్రదాయంలో పవిత్రమైన స్థానం ఉన్నదని పేర్కొన్నారు. పలు కష్టాలు త్యాగాలతో కాలపరీక్షలను నెగ్గి నిలిచిన సీతారాముల ప్రేమ బంధం అజరామరం, ఆదర్శనీయం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలా శ్రీ సీతారాముల చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలకు అందాలని కెసిఆర్ ప్రార్ధించారు.