
కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎంఎల్‌ఎకు ఊరట లభించింది. జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత కుసుమ కుమార్‌లపై ఉన్న కేసుకు సంబంధించి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది ఇరువురిపై ఉన్న కేసును కొట్టివేసింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఎ1 గా ఉన్న తూర్పు జయప్రకాష్ రెడ్డి, ఎ3గా ఉన్న కుసుమ కుమార్‌ల కేసులో నేరాలు రుజువు కాలేదని పేర్కొన్న కోర్టు వారిని నిర్దోషుషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. జగ్గారెడ్డి, కుసుమ కుమార్ తరఫున న్యాయవాది జి. సంతోష్ రెడ్డి కేసును వాదించారు. జగ్గారెడ్డి ఎంఎల్‌ఎగా ఉన్న సమయంలో
2004 లో మానవ అక్రమ రవాణాకు పాల్ప డినట్లు ఆరోపణలున్నాయి. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ నుంచి భార్య, కుమార్తె, కుమారుడి పేరున పాస్ పోర్టు లు పొందారని అప్పట్లో కేసు నమోదైంది. ఆ తర్వాత అమెరికా వీసా పొంది తన వెంట ఒక మహిళ, యువకుడిని తీసుకెళ్లి ఇండియాకు తిరిగి ఒక్క రే వచ్చినట్లు ఆరోపణలు న్నాయి. ఫేక్ డాక్యుమెంట్లతో ముగ్గురు వ్యక్తులను దేశం దాటించారని. ఈ ప్రక్రియలో ఆర్థికంగా ప్రయోజనం పొందినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో 2018 లో అరెస్టై, ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా కేసును విచారించిన కోర్టు నేరాలు రుజువు కాలేదని కేసును కొట్టి వేస్తూ తీర్పును వెలువరించింది.