
దేశవ్యాప్తంగా మొత్తం మీద 1300 ఐఎఎస్, 505 ఐపిఎస్ పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని బుధవారం సిబ్బంది వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ రాతపూర్వక సమాధానంలో తెలిపారు. కీలక పోలీసు అధికారుల నియామకాలలో మంజూరి అయిన పోస్టుల సంఖ్య మొత్తం మీద 5099. అయితే నియమిత ఐపిఎస్‌ల సంఖ్య ఇప్పుడు 4594గా ఉంది. కాగా పరిపాలనా నిర్వహణ సంబంధిత ఐఎఎస్ పోస్టుల మంజూరీ సామర్థం 6877. అయితే నియుక్త అధికారుల సంఖ్య 5577గా ఉంది. ప్రభుత్వ రిజర్వేషన్ నియమావళి మేరకు ఐఎఎస్ పోస్టుల భర్తీ జరుగుతోందని మంత్రి వివరించారు. ఎప్పటికప్పుడు ఖాళీలను సమీక్షించుకుంటూ , రిజర్వేషన్ల ప్రక్రియకు అనుగుణంగానే ఐఎఎస్ ఖాళీల భర్తీ జరుగుతోంది.