
గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. విలేజ్ స్టోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. అయితే ఈ సినిమా సెట్స్‌లో రామ్‌చరణ్ గాయపడ్డారని తెలిసింది. దీనిపై ‘పెద్ది’ టీమ్ స్పందించింది. ప్రస్తుతం రామ్‌చరణ్ కోలుకుంటున్నారని తెలిపింది. సెట్స్‌లో చరణ్ కుడి కంటికి స్వల్ప గాయమైందని, తగిన ట్రీట్‌మెంట్ జరిగిందని పేర్కొంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు సూచించింది. చరణ్ గాయం విషయంలో వస్తున్న రూమర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. గురువారం (మార్చి 26) నుంచి చరణ్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని పేర్కొంది. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.