
పౌల్ట్రీ కంపెనీల విధానాలకు నిరసనగా ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి చికెన్ దుకాణాలను బంద్ చేసేందుకు చికెన్ వ్యాపారులు సిద్దమవుతున్నారు. ఇచ్చే మార్జిన్ సరిపోవడంలేదని, తద్వారా తీవ్ర నష్టాలకు గురికావల్సివస్తోందని పలు పర్యాయాలు పౌల్ట్రీ కంపెనీలకు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో ఇచ్చే మార్జిన్ కంటే 20 రూపాయలు తక్కువగా ఇస్తున్నారని, రోజురోజుకు చికెన్ ధరలు పెరుగుతున్నా తమకు ఇచ్చే మార్జిన్‌ను మాత్రం తగ్గిస్తున్నారని, ఇందుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బంద్‌ను నిర్వహిస్తున్నామని చికెన్ వ్యాపారులు తెలిపారు. తక్షణమే స్పందించి తమకు మార్జిన్‌ను పెంచాలని, లేనిపక్షంలో చికెన్ దుకాణాలను మూసివేసి ఆందోళనలను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.