Reading Time: < 1 minute

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసస్థాయిలో విమర్శలు చేశారు. మహిళలకు 33 శాతం పీట్లు కేటాయిస్తే రేవంత్ రెడ్డికి నష్టమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీ, పార్లమె్ంట్ సీట్ల సంఖ్య పెంపుతో దక్షిణాదికి ఏం జరుగుతుందని అన్నారు.

‘‘ప్రాంతీయ అసమానత పేరుతో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారు. దేశాన్ని విభజించాలని చూస్తున్నారా? దేశ భక్తి, జాతీయవాదం మీలో మచ్చుకైనా కనిపించవా? తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందనే వణకు మీలో మొదలైందా? అక్కడ ఎన్ని గిమ్మిక్కులు చేసినా పారడం లేదని అర్థమైందా? అందుకే దక్షిణాదికి అన్యాయం అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. మీకు, కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే ద్వేషం. అందుకే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వలేదు. మీరెన్ని కుట్రలు చేసినా మహిళ రిజర్వేషన్లు అమలు చేస్తాం’’ అని బండి సంజయ్ అన్నారు.