Reading Time: < 1 minute

బహుదూర్ పల్లి హెచ్ పి పెట్రోల్ పంపు వద్ద క్యూలైన్లో బారులు తీరిన వాహనదారులు

కుత్బుల్లాపూర్: రాష్ట్రంలో ఒకవైపు డీజిల్ కు పెట్రోల్ కు ఎటువంటి కొరత లేదని వివిధ మాధ్యమాల ద్వారా పోలీసు శాఖ మరియు సివిల్ సప్లై శాఖ అధికారులు ప్రకటనలు విడుదల చేస్తున్న అవి ఎక్కడ మాత్రం ఆచరణలోకి రావడం లేదు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బహుదూర్ పల్లి లోని ప్రైమర్క్ ఎదురుగా ఉన్న లక్ష్మీ వినాయక ఫిల్లింగ్ స్టేషన్ హెచ్పి పెట్రోల్ పంపులో వినూత్న పరిస్థితి ఎదురయింది. వాహనాలను పెట్రోల్ పంపు నిర్వాహకులు లోపటికి అనుమతించకపోవడంతో వాహనాలను బయటే పార్కు చేసిన వాహనదారులు రేషన్ షాప్ వద్ద క్యూలైన్లో నిల్చున్నట్లు చేతిలో వాటర్ బాటిలు, క్యాన్లు పట్టుకొని మండుటెండలో సైతం క్యూలో నిలబడ్డారు. క్యూలైన్లో నిలుచున్న వారికి మాత్రమే పెట్రోలు అమ్మకాలు చేపడుతున్న పంపు నిర్వాహకులు ఇదేంటని ప్రశ్నిస్తే ప్రజలంతా ఒకేసారి వస్తే మేమేం చేయాలంటూ సమాధానం ఇచ్చారు. కార్లు భారీ వాహనాలకు సప్లై లేకుండా కేవలం పెట్రోల్ మాత్రమే బాట్టీళ్ళ లో సరఫరా చేస్తూన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో ప్రకటనలు విడుదల చేసిన ఏ ఒక్క అధికారి కూడా ఇటువైపు కన్నెత్తైనా చూడకపోవడం వారి పనితనానికి అద్దం పడుతుందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని వివిధ శాఖలు గుర్తించి సమన్వయంతో పనిచేసి ప్రజల కష్టాలను తీర్చాలని వాహనదారులు కోరుతున్నారు.