
హైదరాబాద్: సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బుధవారం సాయంత్రం నగరంలోని ఎల్బినగర్, వనస్థలిపురం, హయాత్‌నగర్ ప్రాంతాల్లో వడగళ్ల వాన పడుతోంది. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. కాగా, మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సిటీలోని పలు ప్రాంతాలు భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గచ్చి బౌలీ, షేక్‌పేట, మణికొండ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.షేక్‌పేటలో ఒక్క గంటలోనే 4 సెంటీమీటర్ల వర్షం పడింది. భారీ వానకు ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
శేరిలింగంపల్లి, గచ్చిబౌలీ, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట, సోమాజిగూడ అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్,కూకట్‌పల్లి, చందానగర్, బాలానగర్, మూసాపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్,ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, ఖైరతాబాద్, లక్డికాపూల్, బషీర్‌బాగ్, నారాయణగూడ, కోఠీ, దిల్‌షుక్ నగర్, కొత్తపేట, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, హాయత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలో కురిసిన వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయాలన్సి అధికారులు ఎక్కడ కనిపించక పోవడంతో కనిపించ పోవడంతో వాహనదారులు అసహనానికి గురయ్యారు.