
హైదరాబాద్: కని, పెంచిన తల్లినే కడతేలర్చింది ఓ కసాయి కూతురు. ప్రియుడితో కలిసి ఉండటాన్ని అడ్డుకుందని.. ఈ దారుణానికి ఒడి గట్టంది. తల్లి చపంంపేసి. ఇంట్లోనే పాతిపెట్టేసింది. ఈ దుర్ఘటన నగరంలోని జవహర్‌నగర్ పరిధిలోని భరత్ నగర్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజు అనే మహిళ అదృశ్యమైంది. దీంతో ఆమె పెద్ద కుమార్తె జవహర్‌నగర్ పిఎస్‌లో ఫిర్యాదు చేసింది. కుటుంబసభ్యుల ఫోన్ కాల్స్ విశ్లేషించడంతో పాటు స్థానికులను పోలీసులు విచారించారు. ఈ క్రమంలో తానే తల్లిని హత్య చేసినట్లు చిన్న కుమార్తె ఇషిక అంగీకరించింది. ఆమె ప్రియుడు మౌంటీ రాజ్‌తో కలిసి ఈ హత్య చేసినట్లు వెల్లడించింది. ప్రియుడితో సహజీవనంపై తల్లి మందలిండంో తో ఆమెను చంపి ఇంట్లోనే పాతిపెట్టింది. దీంతో పోలీసులు ఘటనస్థలికి చేరుకొని మృతదేహాన్న వెలికితీశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.