
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం రాష్ట్ర హైకోర్టు.. ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఇటీవల పార్టీ ఫిరాయింపు కేసులో 10మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకరక గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఈ కేసులో విచారణను సుప్రీంకోర్టు ముగిస్తున్నట్లు ప్రకటించింది.
అయితే, స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం, బండ్ల కృష్ణమహన్‌రెడ్డి, తెల్లం వెంకట్రావులపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఏడుగురు ఎమ్మెల్యేలతోపాటు స్పీకర్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. బిఆర్ఎస్ వేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.