Reading Time: < 1 minute

హైదరాబాద్:  భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ కొరత వదంతులు పూర్తిగా నిరాధారమైనవని బిపిసిఎల్ తెలిపింది. భారత్‌లో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, బిపిసిఎల్ పూర్తిస్థాయిలో పనిచేస్తోందన్నారు. దేశమంతా ఇంధన సరఫరా నడుస్తోందని, దేశంలో ఇంధనం కొరత అంటూ పుకార్లు వస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని తెలియజేశారు. 

భారతదేశంలో ఇంధన కొరత లేదని, వాస్తవానికి, భారత్ పెట్రోల్, డీజిల్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోందని, ముడి చమురు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా వ్యవస్థలో ఎలాంటి అభ్యంతరాలు లేవు అని, భారత్ పెట్రోలియం సంస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తోందని, అంతరాయం లేని సరఫరాను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని బిపిసిఎల్ ప్రకటించింది. ప్రజలు భయాందోళనతో అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేయవద్దని, పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉందన్నారు.