Reading Time: < 1 minute

టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియడం లేదని అమెరికా అసెట్ మేనేజ్‌మెంట్ దిగ్గజం బ్లాక్‌రాక్ సిఇఒ లారీ ఫింక్ తెలిపాడు. ఇలాగే యుద్దం కొనసాగితే చమురు ధరలు 150 డాలర్లకు చేరుకుందని, దీంతో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తోందని హెచ్చరించారు. ఒకే వేళ ఘర్షణలు ముగిసి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇరాన్‌ను ప్రపంచం ఆమోదిస్తే చమురు ధరల ఒక్కసారిగా పడిపోతాయని వివరించారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఫింక్ తెలిపారు. ఇప్పటికే యుద్ధం ముగించేందుకు ఇరాన్‌తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌కు అమెరికా కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇరాన్ వద్ద ఉన్న అణుసామర్థాలను తప్పనిసరిగా నిర్వీర్యం చేయడంతో పాటు నతాంజ్. ఇస్ఫహాన్, ఫోర్తో అను కేంద్రాలను ధ్వంసం చేయాలని అమెరికా డిమాండ్ చేసింది. అణ్వాయుధాలను ఎప్పటికీ తయారు చేయకూడదని, అణుశుద్ధి చేయకూడదని, 450 కిలోల యురేనియాన్ని వరల్డ్ అటామిక్ ఎనర్జీ ఎజెన్సీకి అప్పగించాలనే డిమాండ్లు ఇరాన్ ముందు అమెరికా పెట్టినట్లు తెలుస్తోంది.