
హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని వదంతులు నమ్మొద్దని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వాహనదారులు అనవసరంగా ఎక్కువ పెట్రోల్ నిల్వ చేసుకోవద్దని హెచ్చరించారు. సోమవారం ఒక్క రోజే 1500 పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు బంక్ లకు పంపిణీ చేశామని, సుమారు 20 వేల కిలో లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందన్నారు. రోజు వారి అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.