
అమరావతి: ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. విజయనగరం జిల్లా తెర్లాం మండలం జన్లివలస గ్రామానికి చెందిన నాగేళ్ల సురేష్ అనే యువకుడు (25) హైదరాబాద్‌లోని ఓ జువెల్లరీ షాపులో పని చేస్తున్నాడు. గతంలో అరకు లోయ రిసార్ట్ లో కూడి పని చేసినట్టు తెలుస్తోంది. అరకులోయ సమీపంలోని రూప రిసార్ట్ వద్ద సురేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్‌తో కొట్టి అనంతరం కత్తితో పొడిచి చంపేశారు. గంజాయి మత్తులో హత్య చేసి ఉంటారా లేక మరేదైనా కోణంలో చంపేశారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య ప్రస్తుతం గర్భవతి ఉంది.