
అమరావతి: ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. ఎర్రకోట గ్రామ శివారులో జిన్నింగ్ మిల్లు సమీపంలో పొలంలో కాలిపోయిన మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన వ్యక్తి వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ కాల్చి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. అక్రమ సంబంధాలు లేక పాత కక్షల నేపథ్యంలో హత్యలు చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం ఎవరిదో తెలిస్తే నిందితులను త్వరంగా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. కర్నూలు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు.