
హైదరాబాద్: పెద్ది సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తన్నారు. ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. చరణ్‌కు జోడిగా హీరోయిన్ జాన్వీకపూర్ నటిస్తున్నారు. స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ మెరువనున్నారు. రామచ్ చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్రయత్నిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలనే లక్షంతో షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్ గాయపడినట్టు తెలుస్తోంది. కంటికి దెబ్బతగిలినట్టు సమాచారం. ఇది చిన్న గాయమేనని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పారు. దీంతో పెద్ది సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్, బోమన్ ఇరానీ, దివ్వేందు తదితరలు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి రెండు పాటలు విడుదల చేయడంతో యూ ట్యూబ్‌లో ట్రెండ్‌లోకి వచ్చాయి.