Reading Time: < 1 minute

ఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ ఎంపి సోనియా గాంధీ అనారోగ్యానికి గురయ్యారు. సోనియా గాంధీకి ఛాతీలో నొప్పి రావడంతో  ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు. 2026 జనవరిలో కూడా ఆమె అనారోగ్యం పాలు కావడంతో ఆరు రోజుల పాటు సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించిన విషయం తెలిసిందే. ఆమెకు డాక్టర్ అనూప్ బసు పర్యవేక్షణలో ఛాతీ వైద్య నిపుణుల బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ముందుజాగ్రత్తగా ఆమెను పర్యవేక్షణలో ఉంచారు. కాలుష్యం కారణంగా సోనియా గాంధీ కొంతకాలంగా తగ్గని దగ్గుతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.