
ఇప్పపువ్వు సారాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని, తనకు ఇప్పపువ్వు సారాపై పూర్తి అవగాహన ఉందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇప్పుపువ్వు సారాపైన తాను అవగాహనా లేకుండా మాట్లాడడం లేదని, నేడు అసెంబ్లీలో ఇప్పపువ్వు సారాపై మాట్లాడుతానని, అన్ని వివరాలు వెల్లడిస్తానని అనిరుధ్ రెడ్డి చెప్పారు. ఎవరైతే తనను సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తున్నారో వారు అసెంబ్లీలో తన ప్రసంగం వినాలని ఆయన సూచించారు. గతంలో ఇప్పపువ్వు సారా
తాగిన వాళ్లు 115 ఏళ్లు బ్రతికారని, కానీ, ప్రస్తుతం కల్తీ బ్రాండ్లు తాగిన వారు కేవలం 60 ఏళ్లు మాత్రమే బ్రతుకుతున్నారని ఆయన తెలిపారు. విదేశాల్లో అనేక కల్తీ బ్రాండ్లు ఉన్నాయని వాటికి మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎస్టీ సోదరులు ఆర్థికంగా ఎదగాలంటే ఇప్ప పువ్వు సారాకు ప్రాధాన్యత కల్పించాలని తాను ప్రభుత్వాన్ని కోరుతానన్నారు. తెలంగాణలో ఇప్ప పువ్వు సారతో లక్ష కోట్ల రెవెన్యూ వచ్చే విధంగా మార్కెట్ ఎక్స్‌పోర్ట్ కూడా చేయవచ్చని ఆయన అన్నారు.