Reading Time: < 1 minute

టెక్సాస్ లోని పోర్ట్ ఆర్థర్‌లో గల వాలెరో రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. రిఫైనరీ లోని ఓ ఇండస్ట్రియల్ హీటర్ పేలడంతో ప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలోఈ ప్రమాదం సంభవించింది. పేలుడు సమయంలో భారీ శబ్దం వచ్చినట్టు స్థానికులు తెలిపారు. కొన్ని మైళ్ల దూరం వరకు భూమి కంపించినట్టు వెల్లడించారు. అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులను షెల్టర్లకు తరలిస్తున్నారు. అమెరికా లోని కీలకమైన చమురు శుద్ధి కేంద్రాల్లో వాలెరో రిఫైనరీ ఒకటి. ఇందులో రోజుకు 3,80,000 బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను రిఫైన్ చేస్తుంటారు.