Reading Time: < 1 minute

పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధానికి అర్థవంతమైన ముగింపునిచ్చేందుకు అమెరికాఇరాన్ నడుమ చర్చల్లో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దాన్ని తాను గౌరవంగా కూడా భావిస్తానని మంగళవారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతకు పాక్ ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందన్నారు. అమెరికా, ఇరాక్ శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక కానుందని ఊహాగానాలు వెలువడిన నేపథ్యలో షరీఫ్ ప్రకటన చేయడం విశేషం. మరోవైపు చర్చలకు ఇస్లామాబాద్ వేదిక కానుందని అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై అమెరికా ఇప్పటి వరకు స్పందించలేదు.