Reading Time: < 1 minute

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ప్రజలపై ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) హామీల వర్షం కురిపించింది. మంగళవారం అన్నాడిఎంకె తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే..రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఉచిత రిఫ్రిజిరేటర్లు ఇస్తామని.. మహిళలతోపాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్నికల్పిస్తామని హమీ ఇచ్చింది.

మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు..

రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు, 1 కిలో పప్పు, 1 లీటరు వంట నూనె.

సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు.

ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం.

వృద్ధులు , ఇతర లబ్ధిదారుల సామాజిక భద్రతా పింఛన్లను రూ. 2,000కు పెంపు.

జల్లికట్టు కళాకారుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం.

కాగా, తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరగనున్నాయి, ఫలితాలు మే 4న ప్రకటించనున్నారు.