
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన ఆశిష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ’దేత్తడి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ ఆదిత్య రావు గంగసాని దర్శకత్వం వహిస్తున్నాడు. ఆశిష్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. మంగళవారం సాయంత్రం ఈ మూవీ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్ యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. జునైద్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు క్రియేటివ్ హెడ్‌గా కూడా పని చేస్తున్నారు.