Reading Time: < 1 minute

యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ తన 8 ఏళ్ల సంగీత ప్రస్థానంలో 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించా రు. వాటిలో నాగార్జున నటించిన ది ఘోస్ట్, ప్రియదర్శి మల్లేశం, తేజ సజ్జ జాంబీరెడ్డి, తాప్సీ మిషన్ ఇంపాజిబుల్, నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ వంటి విజయవంతమైన చిత్రాలున్నాయి. తాజాగా దండోరా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు మార్క్ కె రాబిన్. ఈ సందర్భంగా సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని, తన ప్రయాణంలోని విశేషాల గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ “దండోరా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్ దక్కడం సంతోషంగా ఉంది. గద్దర్ అవార్డ్ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా.

డైరెక్టర్ మురళి చాలా క్లారిటీగా దండోరా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలోని కథాంశమే నన్ను మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ప్రేరణనిచ్చింది. కులాల మధ్య ఉన్న అడ్డుగోడలు, చివరకు చనిపోయాక అంతిమ సంస్కారాలు కూడా చేయకుండా అడ్డుకోవడం, ఒక బ్రిడ్జి మీద నుంచి శవాలను నీటిలోకి దింపడం వంటివి దర్శకుడు చెప్పాక నా మనసు చలించింది. భావోద్వేగం నిండిన మనసుతోనే దండోరా సినిమాకు సంగీతాన్ని అందించాను. ఇక నాని తను నిర్మించిన అ..! సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం కల్పించారు. ఆ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. అలా టాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 8 ఏళ్ల ప్రయాణంలో 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించాను. – మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాకు మ్యూజిక్ చేయాలనేది నా డ్రీమ్. – ప్రస్తు తం కథాకళి అనే ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ప్రశాంత్ వర్మతో రెండు మూవీస్ చేస్తున్నాను”అని అన్నారు.