
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తండాలో దారుణం చోటుచేసుకుంది. బీమా డబ్బులతో పాటు ఆస్తి పంచి ఇవ్వాలని తండ్రితో పాటు చిన్నమ్మ, సోదరులపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. హన్మంతు నాయక్ ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు కుమారుడు అనార్సింగ్ ఉండగా రెండో భార్య రమణి బాయ్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆస్తిలో వాటాతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని తండ్రి, చిన్నమ్మ, సోదరులపై అనార్సింగ్ పగ పెంచుకున్నాడు. కన్నతండ్రి హనుమంతు నాయక్ తో పాటు చిన్నమ్మ సర్పంచి రమణి బాయ్ తో పాటు ఇద్దరు తమ్ముళ్లు ఇంట్లో నిద్రిస్తుండగా వారిపై మొదటి భార్య కుమారుడు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. స్థానికులు గమనించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మంటల్లో కాలిపోయిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.👍🏻