
హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిన పనులకు తాము నిధులు మంజూరు చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మున్సిపల్ శాఖ అభివృద్ధికి సంబందించి.. సిఎం రేవత్ రెడ్డి ఓ ప్రణాళికను తీసుకున్నారు అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శీధర్ బాబు మున్సిపల్ శాఖ అభివృద్ధికి సంబందించి మాట్లాడారు. జిహెచ్ఎంసి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు నిధులు మంజూరు చేశామని, రూ. 122 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఎమ్మెల్యేలు చెప్పారని తెలియజేశారు. 2016 లో ఎస్ఆర్ డిపిని తీసుకువచ్చారని, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.